Reading Time: < 1 minute

వాషింగ్టన్: అట్లాంటిక్ వేడెక్కుతోంది. అమెరికా దళాలు ఒలైనా అనే చమురు నౌకను కరేబియా సముద్రంలో పట్టుకున్నాయి. వెనెజులా చమురు రవాణాకు సంబంధించిన ఈ నౌక గత మూడు రోజుల్లో అమెరికా సైన్యం పట్టుకున్న మూడో ట్యాంకర్ కాగా, మొత్తం పట్టుబడిన నౌకల్లో ఐదవది. అమెరికా మెరైన్స్ అండ్ నేవీ సిబ్బంది ఈ ఆపరేషన్ నిర్వహించాయి. కోస్ట్ గార్డ్ పట్టుబడ్డాడని, ఒలైనా మోటార్ ట్యాంకర్ స్వాదీనమైందని అమెరికా హోం లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిషి నోయెమ్ వెల్లడించారు. ఈమేరకు వీడియో షేర్ చేశారు. వెనెజులా స్వాధీనం అయిన తరువాత ఆంక్షలున్న చమురును చాటుమాటుగా అమెరికా యంత్రాంగానికి దొరక్కుండా తుతరలించుకుపోతున్నారని తెలిపారు.