
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం భారీగా హైడ్రోఫోనిక్ గంజాయి పట్టుబడింది. ఖతార్ దేశం నుండి వచ్చిన విమానంలో దీనిని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఖతార్ ఎయిర్ లైన్స్ (501) విమానంలో వచ్చిన ఒక ప్రయాణికుడు ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వెంటనే కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా లగేజీలో మత్తు పదార్థం ఉన్నట్టు తేలింది. లగేజీ బ్యాగేజ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో అందులో హైడ్రోఫోనిక్ గంజాయి బయటపడింది. పట్టుబడ్డ 14 కిలోలు గంజాయి విలువ 14 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.