
నవీ ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్-2026 ఘనంగా ప్రారంభమైంది. నవీ ముంబైలో తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగూళరు కెప్టెన్ స్మృతి మంధాన తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. అయితే పవర్‌ప్లేలో ఆర్‌సిబి బౌలర్ లారెన్ బెల్ ముంబై బ్యాటర్లకు చుక్కలు చూపించింది. పవర్‌ప్లేలో మూడు ఓవర్‌లు బౌలింగ్ వేసిన బెల్ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసింది. బెల్ వేసిన ఐదో ఓవర్ చివరి బంతికి అమిలియా కెర్ర్ (4) భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయింది. ఆరో ఓవర్‌లో ముంబై మూడు బౌండరీలు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై 1 వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది. ఆ తర్వాత డె క్లెర్క్ వేసిన ఏడో ఓవర్ రెండో బంతికి సీవర్ బ్రంట్(4) స్టంప్ ఔట్ అయింది. దీంతో 7 ఓవర్లు ముగిసేసరికి ముంబై 2 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది.