
హైదరాబాద్: సంక్రాంతి వండుగ సందర్భంగా తెలుగులో చాలా చిత్రలు విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు చిత్రాలు టికెట్ ధరలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో ‘ది రాజాసాబ్’, ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రాలకు టికెట్ ధరని పించరు. అయితే ఈ టికెట్ ధరల పెంపుపై తాజాగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ అధికారుల తీరును తప్పుబట్టింది. న్యాయస్థానం చెప్పినా పట్టించుకోరా అంటూ ప్రభుత్వంపై సీరియస్ అయింది. కొద్ది రోజుల టికెట్ ధరలు పెంచబోమని మంత్రి చెప్పినా మళ్లీ ఎందుకు పెంచారని ప్రశ్నించింది.