Reading Time: < 1 minute

టీం ఇండియా త్వరలో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇప్పటికే ఈ కీలక సిరీస్‌ కోసం ఇప్పటికే భఆరత్ కసరత్తు ప్రారంభించింది. అయితే ఈ సిరీస్‌కి ముందు జట్టులో కీలక మార్పు జరిగినట్లు తెలుస్తోంది. తీవ్రమైన పొత్తి కడుపు నొప్పితో తిలక్ వర్మ బుధవారం ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడికి బుధవారం శస్త్ర చికిత్స జరిగింది. గురువారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తిలక్ శుక్రవారం హైదరాబాద్‌కు వెళ్లనున్నాడు. అయితే ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. వేగంగా కోలుకుంటున్నాడని బిసిసిఐ తెలిపింది.

ఈ నేపథ్యంలో తిలక్ ఒకవేళ కివీస్‌తో సిరీస్‌కి దూరమైతే.. జట్టులోకి ఎవరు వస్తారని మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘తిలక్ వర్మ గాయపడ్డాడు. అతడు టి-20 ప్రపంచకప్ టోర్నీకి కూడా దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి టీం ఇండియాలో అతడి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? నా అభిప్రాయం ప్రకారం. ఆ ఆటగాడు మరెవరో కాదు.. శ్రేయస్ అయ్యర్. అవును… ‘సర్పంచ్’ సాబ్ ఆటోమేటిక్‌గా జట్టులోకి రావాల్సిందే’’ అని ఆకాశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.