Reading Time: < 1 minute

హైదరాబాద్: ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీపడుతోందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పెట్టుబడులకు లాభం వచ్చేలా ప్రభుత్వ ప్రణాళికలు ఉన్నాయని అన్నారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సుజెన్ మెడికేర్ ప్రారంభోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబు, ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం ప్రసంగించారు. ప్రపంచస్థాయి దేశాలతో తెలంగాణ పోటీపడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం మనరాష్ట్రంలో ఉందని తెలియజేశారు. పెట్టుబడిదారులకు విశ్వాసం కల్పించేలా ప్రభుత్వం పాలసీ రూపొందించిందని, పెద్ద కంపెనీలకు సిఇవోలుగా ఉన్నది.. మన దేశంవాళ్లేనని రేవంత్ పేర్కొన్నారు. పంచాయతీ కావాలా.. నీళ్లు కావాలా.. అని తనని అడిగే.. తెలంగాణకు నీళ్లే కావాలని చెబుతానని, వివాదాలు కావాలా.. పరిష్కారం కావాలా.. అని అడిగితే పరిష్కారం కావాలని చెబుతానని అన్నారు. నీళ్ల వివాదం విషయంలో రాజకీయ ప్రయోజనం పొందాలని తమ ప్రభుత్వం ప్రయత్నించలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.