Reading Time: < 1 minute

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం సీరియల్ స్నాచర్ గా వ్యవహరిస్తోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. జయశంకర్ వ్యవసాయ వర్శిటీ నుంచి వందెకరాలు తీసుకున్నారని అన్నారు. ఉర్దూ వర్శిటీ భూములకు సంబంధించి ప్రభుత్వ నోటీసుల దృష్ట్యా భేటీ అయ్యారు. బంజారాహిల్స్ నందినగర్ లోని నివాసంలో ఉర్దూ విశ్వవిద్యాలయం విద్యార్థులతో కెటిఆర్ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు లాక్కోవడం ఇదే మొదటిది కాదని, వర్శిటీ భూములపై విద్యార్థులు పోరాడినా ఆందోళనను అణచివేశారని మండిపడ్డారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలోనూ ఇదే విధమైన భూదందా చేశారని, హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీకి సంబంధించి 400 ఎకరాలు తీసుకునే యత్నం చేసిందని తెలియజేశారు. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని ఆదేశాలు ఇచ్చే వరకు రాష్ట్రం, కేంద్రం పట్టించుకోలేదని, వర్శిటీ భూములపై సుప్రీంకోర్టు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని వేసిందని కెటిఆర్ పేర్కొన్నారు.