
ముంబయి: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇక్కడే ఉన్నాడని ఐసిసి చైర్మన్ జైషా తెలిపారు. హిట్‌మ్యాన్‌ను ఎప్పటికి కెప్టెన్ అని పిలుస్తానని చెప్పడంతో రోహిత్ శర్మ ముఖంలో నవ్వులు కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత్‌కు హిట్‌మ్యాన్ రెండు ట్రోఫీలు అందించాడని, 2023 ప్రపంచ కప్‌లో వరసగా పది మ్యాచ్‌ల్లో విజయం సాధించాడని, చివర మెట్టులో ఓటమిని చవిచూడడంతో కప్‌ను అందుకోలేకపోయాడు. రాజ్‌కోట్‌లో 2024 ఫిబ్రవరిలో తాను రోహిత్‌కు ఒక విషయం చెప్పానని, వచ్చే ప్రపంచ కప్‌లో ట్రోఫీతో పాటు హృదయాలను గెలుచుకోబోతున్నామని తెలిపారు.
రోహిత్ శర్మ 2021లో టీమిండియా వన్డే జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు 56 మ్యాచ్‌లలో 42 గెలిచి రికార్డు సృస్టించాడు. రోహిత్ కెప్టెన్సీలో భారత్ ఆసియా కప్ గెలుచుకుంది. 2025లో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. రోహిత్ శర్మ టి20ల్లో 62 మ్యాచ్‌లకు గాను 49 గెలిచి 79.03 శాతంతో రికార్డు విజయాలు సాధించాడు. 2024 టి20 వరల్డ్ కప్ కూడా రోహిత్ కెప్టెన్సీలో గెలుచుకున్నాం. ఇప్పటికే రోహిత్ శర్మ టి20, టెస్టులకు గుడ్‌బై చెప్పి కేవలం వన్డేలలో మాత్రమే ఆడుతున్నాడు. వన్డేలలో 11516 పరుగులు చేయడంతో మూడు డబుల్ సెంచరీలు చేశాడు. వన్డేలలో 264 అత్యధిక పరుగుల రికార్డు రోహిత్ పేరు పైనే ఉంది. మూడు ఫార్మాట్లలో కలిపి 20 వేల పరుగుల క్లబ్ లో ఉన్నాడు.