Reading Time: < 1 minute

స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ సినిమాలో కనిపించిన సామ్.. ఆ తర్వాత బ్రేక్ తీసుకుంది. గతేడాది అక్టోబర్‌లో ఆమె నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా ప్రారంభమైంది. కానీ, అప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ చాలాకాలం వరకూ రాలేదు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

‘ఎట్లాగో ఇక్కడివరకు వచ్చినాం కదా.. ఉండిపోదాం…’ అంటూ సమంత చెప్పే డైలాగ్‌తో టీజర్ ప్రారంభం అవుతుంది. ఈ టీజర్‌లో చీరకట్టులో తొలుత క్లాస్‌గా కనిపించిన సమంత.. ఆ తర్వాత ఫుల్ యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టింది. ముఖ్యంగా బస్‌లో, అత్తగారింట్లో సమంత ఫైట్‌ సీన్స్‌ చేసినట్లు చూపించారు. సమంత ఫ్యాన్స్‌కి ఈ టీజర్‌తో ఫుల్ మీల్స్ పెట్టారు. ఇక ‘ఓ బేబీ’ సినిమా తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత చేస్తున్న రెండో సినిమా ఇది. సమంత భర్త రాజ్ నిడిమోరు, వసంత్ మారిగంటితో కలిసి ఈ సినిమాకు కథ అందించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.