Reading Time: < 1 minute

అమరావతి: ఎన్టిఆర్ జిల్లా కంచికచర్ల తహశీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాత పట్టాదారు పాస్ పుస్తకాలు, దస్త్రాలు ఉన్న గదిలో మంటలు చెలరేగడంతో రికార్డు రూమ్ లో ఫైళ్లు దగ్ధం అయ్యాయి. షార్ట్ సర్క్యూట్ జరిగిందా? ఉద్దేశపూర్వకంగానే చేశారా? అనుమానం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంపై జెసి, ఆర్డివో విచారణ జరిపించారు. కార్యాలయం పక్కన ఉన్న చలిమంటే అగ్నిప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. తదుపరి విచారణలో ప్రధాన రికార్డులు భద్రంగా ఉండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.