Reading Time: < 1 minute

‘ఉయ్యాలా జంపాలా’ హీరోయిన్ అవికా గోర్ పెట్టిన పోస్టు రూమర్స్ క్రియేట్ చేసింది. ‘కొత్త ప్రారంభం’ అనే క్యాప్షన్‌తో తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో తల్లి కాబోతుందని నెటిజన్లు ట్రోల్ చేశారు. దీంతో ఆమె ఆ వార్తలను ఖండించారు. తాను తల్లి కాబోతున్న వార్తాల్లో నిజం లేదని, పూర్తిగా అబద్ధం అని అన్నారు. ఈ విషయంలో అభిమానులు త్వరగా అంచనాకు వచ్చారని ప్రశ్నించారు. నిజం చెప్పాలంటే పెద్ద శుభవార్త ఉందని త్వరలో చెబుతామని స్పష్టం చేశారు. కొత్త మూవీపై అప్‌డేట్ ఇస్తారేమోనని నెటిజన్ల ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ‘ఉయ్యలా జంపాల’ సినిమాతో టాలీవుడ్‌లోకి రంగప్రవేశం చేశారు. ‘సినిమా చూపిస్తమావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజుగారి గది3’ వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. 2025 సెప్టెంబర్ 30న తన ప్రియుడు మిళింద్ చద్వానీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.