Reading Time: < 1 minute

జీ స్టూడియోస్ సమర్పణలో.. నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాతగా ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిర్మిస్తోన్న చిత్రానికి ‘రాకాస’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ టైటిల్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. సినిమాను ఏప్రిల్ 3న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘రాకాస’ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత్ శోభన్ ఈ చిత్రంలో కథానాయకుడిగా మెప్పించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ మాట్లాడుతూ “రాకాస.. ఫాంటసీ కామెడీ మూవీ. నయన్ సారి క హీరోయిన్‌గా నటిస్తోంది. ఒక సాంగ్, నాలు గు రోజుల టాకీ పార్ట్ చిత్రీకరణ మాత్రమే మిగి లి ఉంది. త్వరలోనే దాన్ని పూర్తి చేస్తాం. సమ్మర్ సందర్బంగా ఏప్రిల్ 3న మూవీని రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం”అని అన్నారు.