
హైదరాబాద్: చిక్కడపల్లి, ఆర్‌టిసి క్రాస్ రోడ్డు ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. శుక్రవారం 11 గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఓ ప్రైవేట్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొననున్నారు. మంగళవారం రాత్రి ఈ ప్రాంతంలోనే నిరుద్యోగులు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలని నిరసనకు దిగారు. రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నిరుద్యోగులు నిరసనలు, ధర్నాలు చేసే అవకాశం ఉంది. దీంతో ముందస్తుగానే పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఆర్‌టిసి క్రాస్ రోడ్డు ప్రాంతమంతా టెన్షన్ వాతావరణం నెలకొంది.