Reading Time: < 1 minute

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు ’విష్ణు విన్యాసం’ అనే యూనిక్ ప్రాజెక్ట్‌తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు యదునాథ్ మారుతి రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు.జి నిర్మించిన ఈ చిత్రాన్ని హేమ, షాలిని సమర్పిస్తున్నారు. సుబ్రహ్మణ్యం నాయుడు.జి, రామచారి.ఎం సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా చిత్ర బృం దం మ్యూజికల్ జర్నీని ప్రారంభించింది. ఫస్ట్ సింగిల్ ’దేఖో విష్ణు విన్యాసం’ను విడుదల చేశారు. ఈ సరదా పాట కథానాయకుడికి జ్యోతిష్యంపై ఉన్న పిచ్చిని చూపిస్తోంది. రధన్ అందించిన మ్యూజిక్, రామజోగయ్య శాస్త్రి చమత్కారమైన సాహిత్యం, శ్రీకృష్ణ పవర్‌ఫుల్ గాత్రం ఈ పాటను మూఢనమ్మకాలపై ఒక సరదా వేడుకగా మార్చా యి. నయన సారిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.