Reading Time: < 1 minute

తిరుపతి: తిరుమలలో మళ్లీ చిరుత పులి కనిపించిన సంఘటన కలకలం సృష్టించింది. 400వ మెట్టు వద్ద చిరుత కనిపించిందని భక్తులు టిటిడి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో కొంచెంసేపు నడక మార్గంలో వెళ్లే భక్తులను నిలిపివేశారు. చిరుత కోసం టిటిడి, అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో తిరుమలలో పలు చిరుత పులుల పట్టుకున్న విషయం తెలిసిందే. తిరుమల చుట్టు పక్కల శేషాచలం అడవుల్లో అటవీ విస్తీర్ణం తగ్గడంతో తిరుమల కొండపైకి చిరుతలు చేరుకుంటున్నాయి. ఇప్పటికైన అటవీ విస్తీర్ణం పెంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.