Reading Time: < 1 minute

టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ తరుణ్ భాస్కర్ తన అద్భుతమై న నటనతో కూడా అలరిస్తున్నారు. ఆయన లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం ’ఓం శాంతి శాంతి శాంతిః. ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటి స్తున్నారు. ఏఆర్ సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం, సహజమైన హాస్యం, ఆకట్టుకునే డ్రామాతో కూడిన వినోదభరితమైన విలేజ్ కామెడీ. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్ , నవీన్ సనివరపు ఈ వెంచర్‌ను నిర్మిస్తుండగా, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మా తలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్ప టికే విడుదలైన టీజర్ మంచి అంచ నాలను సృష్టించింది. ఫస్ట్ సింగిల్ సిన్నారి కోన సాంగ్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. గురువారం సెకండ్ సింగిల్ ఓం శాంతి శాంతి శాం తిః థీమ్ సాంగ్ రిలీజ్ చేశారు. ప్రతి మహిళకు అంకితంగా నిలిచే ఈ పాటని జయ్ కృష్ణ హృదయాన్ని తాకే విధంగా కంపోజ్ చేశారు. భర ద్వాజ్ గాలి రాసిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓం శాం తి శాంతి శాంతిః జనవరి 23న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.