
హైదరాబాద్: చైనా మాంజాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న కూడా భాగ్యనగరంలో విచ్చలవిడిగా అమ్మకాలు కొనసాగుతున్నాయి. చైనా మాంజాతోనే పతంగులు ఎగరేస్తున్నారు. రెండు వరసలు కట్టిన చైనా మాంజా విద్యుత్ తీగపై పడింది. గుర్తు తెలియని వ్యక్తి మాంజాను లాగడంతో 33 కెవి లైన్ తెగిపడింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని ఓల్డ్ మిర్జాల్‌గూడలో ఈ ఘటన జరిగింది. విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేసి వైర్ ను తొలగించారు. అనంతరం మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్‌లో విద్యుత్ అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాంజాకు చిక్కుకొని పావురాలు చనిపోతాయి. మాంజాలతో పక్షులు అరిగోసపడుతున్నాయి. చైనా మాంజాలు తగిలి ద్విచక్రవాహనాదారులు గాయపడుతున్నారు. చైనా మాంజాతో గొంతు తెగి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.