
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేటలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్‌కు వెళ్లొస్తున్న బస్సు ఫ్లైఓవర్ డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. బస్సులో ఉన్నవారు గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌లోని మణికొండకు టిఎస్ 13ఎఫ్‌బి 3649 అనే నంబరు గల బస్సు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.