Reading Time: < 1 minute

మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ ట్యాంకర్, డిసిఎం వ్యాన్ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. డిసిఎంలో ఉన్న ముగ్గురు కూలీలు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.