
కోపెన్‌హాగెన్: గ్రీన్‌లాండ్‌పై అమెరికా చర్చలపై డెన్మార్క్ గురువారం స్పందించింది. అత్యంత ప్రధానమైన ఖనిజ సంపన్న అర్కిటిక్ గ్రీన్‌లాండ్ దీవులను అమెరికా తమ ఆధీనంలోకి తీసుకుంటుందని ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పడంపై కలకలం చెలరేగింది. కాగా వచ్చే వారం ఈ విషయంపై చర్చకు సిద్ధం అని అమెరికా ముందుకు వచ్చింది. ఈ చర్చల ప్రక్రియను డెన్మార్క్ స్వాగతించింది.
ఇటువంటి సంప్రదింపుల ప్రక్రియ అత్యవసరం అని డెన్మార్క్ రక్షణ మంత్రి ట్రోలెస్ లండ్ పౌల్సెన్ డానిష్ వారా సంస్థ డిఆర్‌కు చెప్పారు. విషయాలను గ్రీన్‌లాండ్‌తో చర్చిస్తే బాగుంటుందని తమ ప్రభుత్వం అమెరికాను కోరిందని, ఈ మేరకు ఇప్పుడు చర్చలకు అవకాశం ఏర్పడటం కీలక పరిణామం అని రక్షణ మంత్రి స్పందించారు. వచ్చే వారం చర్చలు జరుగుతాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. అయితే ఎక్కడ ఎప్పుడు ఇవి జరుగుతాయనేది వివరించలేదు.