Reading Time: < 1 minute

ఆసియాలో అత్యంత ప్రతిష్టాత్మక లైఫ్ సైన్సెస్, హెల్త్-టెక్ సదస్సుగా పేరుగాంచిన బయోఏషియా -2026 (23వ ఎడిషన్) హైదరాబాద్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారిక పోస్టర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు గురువారం ఆవిష్కరించారు. ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న బయో ఏషియా సదస్సు ఏర్పాట్లు అధికారికంగా ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో లైఫ్ సైన్సెస్ రంగం కీలక భూమిక పోషిస్తుందన్నారు.

బయో ఏషియా వంటి అంతర్జాతీయ సదస్సులు తెలంగాణ నాయకత్వాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించడంతోపాటు, కొత్త భాగస్వామ్యాలు, పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధికి కొత్త మార్గాలను సృష్టిస్తాయని పేర్కొన్నారు. బయో ఏషియా 2026తో టెక్బయో విప్లవాన్ని ముందుకు నడిపిస్తూ ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రపంచ నిపుణులను హైదరాబాద్‌లో ఒకే వేదికపైకి తీసుకురావడం తమ లక్ష్యమన్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ మాట్లాడుతూబయో ఏషియా 2026 స్టార్టప్‌లు, పరిశోధకులు, పరిశ్రమల నాయకులు, పాలసీ మేకర్ల మధ్య సహకారాన్ని పెంచే శక్తివంతమైన వేదికగా నిలుస్తుందని చెప్పారు. పెట్టుబడులు, భాగస్వామ్యా కోసం ఈ సదస్సు అవకాశాలను అందిస్తుందని తెలిపారు.