Reading Time: < 1 minute

వాషింగ్టన్ : వెనెజువెలా చమురు వ్యవహారాలు ఉత్పత్తి, ఎగుమతులపై అమెరికా ఆధిపత్యం ఉంటుంది. ఇది నిరవధికంగా ఉంటుందని ప్రెసిడెంట్ ట్రంప్ అధికార యంత్రాంగం గురువారం స్పష్టం చేసింది. సుసంపన్న చమురు వనరులు ఉన్నా, పలు కారణాలతో ఉత్పత్తి తగ్గింది. ఈ దశలో క్షీణ దశలో ఉన్న చమురు వ్యవస్థను అమెరికా ఇంధన కంపెనీలు గుప్పిట్లోకి తీసుకునేలా చర్యలకు దిగుతారు. ఈ మేరకు యుఎస్ ఇంధన సంస్థలకు ట్రంప్ నిర్థిష్ట సూచనలు వెలువరించినట్లు వెల్లడైంది. ముందుగా చమురు ఉత్పత్తిని పునరుద్ధరించాల్సి ఉంటుంది. తరువాత అమెరికా కంపెనీల ద్వారా ఎగుమతులకు దిగాల్సి ఉందని ట్రంప్ చెపుతున్నారు.

దేశాధ్యక్షుడిని భార్యతో పాటు బంధించి అమెరికాకు తీసుకువెళ్లిన తరువాతి క్రమంలో అక్కడి అధికార యంత్రాంగం నియామకం విషయంలోనూ ట్రంప్ జోక్యం ఉంటోంది. చమురు వనరుల వినియోగం ద్వారా వచ్చే ఆదాయాన్ని అమెరికా ఖజానాకు తరలిస్తారు. ఈ విషయాన్ని అమెరికా చమురు ఇంధన మంత్రి క్రిస్ రైట్ ఇప్పటికే తెలిపారు. పేదరికపు వెనెజువెలా లోని ముడిచమురు మార్కెట్‌ను సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. ఈ మేరకు దేశానికి చెందిన కంపెనీలకు వాటి వినియోగానికి అనుమతిని ఇచ్చినట్లు వెల్లడైంది. ముందుగా వెనెజువెలా క్రూడ్‌ను బారెల్స్ రూపంలో నిల్వ చేసి తరువాతి దశలో వాటిని వినియోగించడం జరుగుతుందని ఇటీవల గోల్డ్‌మెన్ సాక్స్ గ్రూప్ సదస్సు మియామీలో జరిగినప్పుడు తెలిపారు.