
ముంబై: టీమిండియా సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం తనను ఎంతో బాధకు గురి చేసిందని భారత మాజీ ఆటగాడు, ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. మరి కొన్నేళ్ల పాటు టెస్టు క్రికెట్ ఆడే సత్తా ఉన్నా కూడా కోహ్లి ఈ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పడం బాధించిందన్నాడు. అతని సమవుజ్జీలుగా పేరున్న స్మిత్, రూట్, కేన్‌లు ఇంకా టెస్టుల్లో కొనసాగుతున్నారన్నాడు. కోహ్లి మాత్రం టెస్టులకు వీడ్కోలు పలికి సులువైన వన్డే ఫార్మాట్‌లో కొనసాగడం సరికాదన్నాడు. ఒకవేళ క్రికెట్‌కు పూర్తిగా రిటైర్మెంట్ ప్రటించినా బాగుండేదనని మంజ్రేకర్ పేర్కొన్నాడు.