Reading Time: < 1 minute

ఆస్ట్రేలియాకు ఆధిక్యం,

యాషెస్ చివరి టెస్టు

సిడ్నీ: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో, చివరి టెస్టులో ఆస్ట్రేలియా కీలకమైన 134 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 384 పరుగులు చేసింది. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన ఆస్ట్రేలియా మంగళవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసి ఆధిక్యాన్ని అందుకుంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్, కెప్టెన్ స్టీవ్ స్మిత్‌లు శతకాలతో జట్టును ఆదుకున్నారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన హెడ్ 166 బంతుల్లోనే 24 ఫోర్లు, ఒక సిక్స్‌తో 163 పరుగులు సాధించాడు. లబుషేన్ (48), వెదరాల్డ్ (21), నెసర్ (24) పరుగులు చేశారు. కామెరూన్ గ్రీన్ (37), కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతున్న ఉస్మాన్ ఖ్వాజా (17), వికెట్ కీపర్ కారే (16), గ్రీన్ (37) పరుగులు సాధించారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన స్మిత్ 129 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతనికి వెబ్‌స్టర్ (42) నాటౌట్ అండగా నిలిచాడు.