
మన తెలంగాణ/హైదరాబాద్: సింగరేణిలో విజయవంతంగా అమలు చేస్తు న్న కోటి రూపాయల బీమా పథకాన్ని అదే తరహాలో విద్యుత్ శాఖలోని డి స్కంలలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూ డా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు. సింగరేణి పరిధిలోని ప్రాంతీయ ఆసుపత్రు ల్లో పెండింగ్‌లో ఉన్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పోస్టులను రాబోయే 2026 మార్చి నాటికి పూర్తిగా భర్తీ చే స్తామని భట్టి విక్రమార్క తెలియజేశా రు. మంగళవారం అసెంబ్లీలో సింగరే ణిపై జరిగిన చర్చ సందర్భంగా సభ్యు లు అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం స మాధానం ఇచ్చారు. ప్రస్తుతం 11మం ది కాంట్రాక్ట్ డాక్టర్లు పనిచేస్తున్నారని 32మంది డాక్టర్ల కోసం నోటిఫికేషన్ ఇచ్చామని త్వరలోనే ఆ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. 176 పారామెడిక ల్ సిబ్బంది అంతర్గత నియామకం ప్ర క్రియ కొనసాగుతున్నదని వెల్లడించా రు. రామగుండంలో క్యాత్ లాబ్ నిర్మా ణం పిపిపి మోడల్‌లో చేపడుతున్నామ ని కాంట్రాక్ట్ అవార్డు కూడా పూర్తయిందని తెలిపారు 75 రోజుల్లో ప్రారంభిస్తామని
ప్రకటించారు. సింగరేణి మనుగడ, కార్మికుల సంక్షేమం కొరకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన పది రోజుల్లోగా సింగరేణి పరిధిలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు సంస్థ సీఎండీ, డైరెక్టర్లతో ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. కార్మికుల భద్రతకు భరోసా కల్పిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం లేదా సింగరేణి సంస్థపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా కేవలం బ్యాంకుల ద్వారానే కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని వెల్లడించారు. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు సింగరేణి ఆసుపత్రుల్లో మందుల సౌకర్యం కల్పిస్తున్నామని, సిపిఆర్‌ఎంఎస్ పథకం అందుబాటులో ఉన్నదని వెల్లడించారు. రిటైర్డ్ ఉద్యోగులు 8 లక్షల వరకు మందులను తీసుకునే అవకాశం కూడా కల్పించామని చెప్పారు. టెర్మినల్ బెనిఫిట్స్ కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. సింగరేణి పరిధిలోని ఖాళీ స్థలాల్లో ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు ఇండ్ల నిర్మాణం కొరకు స్థల కేటాయింపు అంశాన్ని బోర్డులు మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ సింగరేణి సంస్థని వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులపై అందరిపై ఉందన్నారు.
పిల్లల భవిష్యత్‌ను నిర్దేశించేదే రైజింగ్ 2047
మన పిల్లల భవిష్యత్‌ను నిర్దేశించేదే తెలంగాణ రైజింగ్-2047 అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మనం కీలమైన మలుపు 200 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వద్ద ఉన్నామని అన్నారు. 1.2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని నిపుణులు చెబుతున్నారని 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదిగేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తెలంగాణకు భారీగా స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని కఠినమైన లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకెళ్తున్నట్లు తెలిపారు. క్యూర్, ప్యూర్, రేర్ అనే లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించుకుందని ఉపముఖ్యమంత్రి భట్టి తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, తెలంగాణ రైజింగ్ 2047పై చర్చించాలని ప్రతిపక్షాలను కోరుతున్నట్లు చెప్పారు.
2047పై సూచనలు, సలహాలు ఇవ్వాలి
ఇది రాష్ట్ర, పిల్లల భవిష్యత్‌కు చాలా ముఖ్యమని, 2047పై సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. ఆరోగ్య ఖర్చును జిఎస్‌డిపిలో 8 శాతానికి పెంచడానికి తాము కట్టుబడి ఉన్నామని, ఎందుకంటే అనారోగ్య శ్రామిక శక్తి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థను నిర్మించదన్నారు. ఈ పత్రం యొక్క ప్రధాన ఉద్దేశం కోటి మంది మహిళలను కోటీశ్వరులు గా మార్చడమేనన్నారు. తాము స్వయం సహాయక బృందాలకు రుణాలు ఇవ్వడం మాత్రమే కాకుండా ఆ సంఘాలను కార్పొరేట్ సంస్థలుగా మారుస్తున్నామన్నారు. వారికి వ్యక్తిగత క్రెడిట్ స్కోర్‌లను అందించడానికి మేము వారి తిరిగి చెల్లింపు చరిత్రను డిజిటలైజ్ చేస్తున్నామని వివరించారు. మారుమూల గ్రామంలోని ఒక మహిళ బంజారా హిల్స్‌లోని వ్యాపారవేత్త లాగా మూలధనాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుంన్నారు. సబ్సిడీ ద్వారా కాకుండా,
ఎంటర్‌ప్రైజ్ ద్వారా కోటి మంది మహిళలు లక్షాధికారులు కావాలని కోరుకుంటున్నామన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ పై చర్చించడానికి ప్రతిపక్ష సభ్యులను, సహచరులను ఆహ్వానిస్తున్నానని పిలుపునిచ్చారు. మీరు ఆలోచన చేయండి, విశ్లేషించండి, మెరుగైన సూచనలు సలహాలు ఇవ్వాలని సూచించారు. తాను గ్లోబల్ సమ్మిట్ లో చెప్పినట్టుగా ఇది ఒక స్థిరమైన ప్రభుత్వ ఉత్తర్వు కాదని, ఇది ఒక సజీవ వేదిక అన్నారు. 2014లో సోనియా గాంధీ మార్గదర్శకత్వంలో మనం రాజకీయ తెలంగాణ కలను సాకారం చేసుకున్నామని, 2024లో సంపన్న తెలంగాణ కోసం మనం ఒప్పందంపై సంతకం చేసి ముందుకు సాగుదామని సభ్యులకు పిలుపునిచ్చారు.