
మన తెలంగాణ/హైదరాబాద్: గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అశాస్త్రీయంగా జ రిగిన మండలాలు, రెవెన్యూ డివిజన్లను, జిల్లాల ను పునర్వ్యవస్ధీకరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసిం గ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో స భ్యులు రామ్మోహన్ రెడ్డి, వీరేశం, పాల్యాయి హరీ శ్ తదితరులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి పొంగులేటి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వ హయాం లో మండలాల ఏర్పాటు మొదలుకొని జిల్లాల పు నర్వ్యవస్దీకరణ వరకు ఇష్టానురీతిలో మొక్కుబడి గా జరిగాయని అన్నారు. దీని వల్ల ఒకే నియోజకవర్గంలోని నాలుగు మండలాలు నాలుగు జిల్లాల్లో ఉండే పరిస్ధితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు తమ పనుల కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే తమను పొగిడినవారి కోసం ఒక విధంగా, పొగడని వారికోసం మరో విధంగా, తమ అదృష్టసంఖ్యను ఊహించుకొని అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేశారని ఎద్దేవా చేశారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో కొత్త మండలాలు, డివిజన్ల ఆవశ్యకతను కూడా గుర్తించామని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మంత్రి వర్గం చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పునర్వ్యవస్ధీకరణ చేపడతామని తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా నివేదిక తీసుకుని ఇదే శాసనసభలో చర్చించి అందరి ఆమోదంతో పునర్‌వ్యవస్థీకరణ చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాల మార్పులు లేదా చేర్పుల విషయంలో ప్రభుత్వం ఎటువంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోదని మంత్రి హామీ ఇచ్చారు. అధికారుల నివేదిక అందిన తర్వాత, దానిపై మంత్రివర్గంలో లోతుగా చర్చించి, శాసనసభలో సభ్యులందరి అభిప్రాయాలను తీసుకుంటామని చెప్పారు.
పరిపాలన వికేంద్రీకరణ అనేది కేవలం అంకెల్లో కాకుండా, ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు చేరువగా ఉండాలనే లక్ష్యంతోనే ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ఉంటుందని పొంగులేటి స్పష్టం చేశారు. ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద 2014 సంవత్సరానికి ముందు మంజూరైన ఇండ్ల నిర్మాణానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లుల కోసం రూ.388.312 కోట్లు చెల్లించామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. శాసనభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అనిల్ జాదవ్, హరీష్‌రావు, ప్రశాంత్‌రెడ్డి వేముల అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మొత్తం 1,94,150 మంది లబ్దిదారులకు ఈ మొత్తాన్ని చెల్లించినట్లు వెల్లడించారు. అయితే రాష్ట్ర స్థాయిలో అర్హత కలిగిన, ధృవీకరించబడిన బిల్లులు ఏవీ పెండింగ్‌లో లేవని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి గండేడ్, మహమ్మదాబాద్ మండలాలను విడదీసి పరిగి నియోజకవర్గంలోని ప్రస్తుత వికారాబాద్ జిల్లాలో విలీనం చేయాలనే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో లేదని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభ్యుడు డాక్టర్ టి రామ్మోహన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.