Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ యువతకు క్విక్ కామ ర్స్ రంగంలో ఉపాధి కల్పించే లక్ష్యంతో ఇన్‌స్టామార్ట్, యంగ్ ఇండి యా స్కిల్స్ యూనివర్శిటీలు మంగళవారం ఒప్పందం కుదుర్చుకున్నాయి. విఎల్‌విఎస్‌ఎస్ సుబ్బారావు, వైస్ చాన్స్‌లర్ యంగ్‌ఇండి యా స్కిల్ యూనివర్శిటీ, గిరీష్‌మీనన్, చీఫ్ హ్యూమన్‌రీసోర్స్ ఆఫీసర్ సిగ్వీలు ఈ ఒప్పందంలో పాల్గొన్నారు. ఈ ఒప్పందంతో తెలంగాణ యువతకు క్విక్ కామర్స్ రంగంలో 5,000కు పైగా అవకాశా లు రానున్నాయి. తెలంగాణకు చెందిన పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ, ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాం కలిసి చేపట్టిన మొట్టమొదటి వినూత్న కార్యక్రమం ఇది.

దీనికి సంబంధించిన ముఖ్య అంశాలు ఇలా..

లక్ష్యం: పెరుగుతున్న క్విక్ కామర్స్ రంగంలో తెలంగాణ యువతకు అవసరమైన నైపుణ్యాలను నేర్పి, సుమారు 5,000 మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పించడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్ధేశ్యం.

ఒప్పందం: యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ వి.ఎల్.వి.ఎస్.ఎస్. సుబ్బారావు, స్విగ్గీ హెచ్‌ఆర్ ఆఫీసర్ గిరీష్ మీనన్ సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదిరింది.

శిక్షణా కార్యక్రమం: స్విగ్గీ అనుబంధ సంస్థ అయిన ‘స్కూట్సీ’ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ కలిసి మూడు నెలల ప్రత్యేక శిక్షణా కార్యక్రమ్నా నిర్వహిస్తాయి.

ఈ ప్రోగ్రామ్ ద్వారా నేర్చుకునే నైపుణ్యాలు ఇలా..

డార్క్ స్టోర్ ఆపరేషన్స్: స్టోర్ల నిర్వహణ, పంపిణీ ప్రక్రియ.

సప్లై చైన్ మేనేజ్‌మెంట్: సరుకుల సరఫరా, లాజిస్టిక్స్ పద్ధతులు.

కస్టమర్ సర్వీస్: నిర్ణీత సమయంలో (ఎన్‌ఎల్‌ఏ) సేవలను అందించడం.

ప్రాక్టికల్ ట్రైనింగ్: తరగతి గది బోధనతో పాటు క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష అనుభవం.

ఉద్యోగ అవకాశాలు ఇలా..

ఈ కోర్సును, ఇంటర్‌షిప్‌ను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు క్విక్ కామర్స్ విభాగాల్లో ‘స్టోర్ మేనేజర్ ట్రైనీ’గా పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. తద్వారా వారు ఈ రంగంలో నాయకత్వ బాధ్యతలను చేపడుతారు. మారుతున్న రిటైల్ రంగంలో సప్లై చైన్, లాజిస్టిక్స్ విభాగాల్లో నైపుణ్యం కలిగిన యువత అవసరం చాలా ఉంది. ఈ కార్యక్రమం వల్ల యువతను పరిశ్రమకు తగినట్లుగా తీర్చిదిద్దుతున్నారు.