
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటిస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ప్రముఖ హాలీవుడ్ వీఎఫ్‌ఎక్స్ సంస్థలు పనిచేస్తున్నాయి. అయితే తాజాగా ఫైండింగ్ ఫెనీ అనే భాలీవుడ్ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన దీపికా పదుకొనే మాట్లాడుతూ తెలుగులో తనకు ఇష్టమైన హీరో మహేష్ బాబు అని చెప్పింది. అతనితో కలిసి ఓ సినిమాలో నటించాలని కోరుకుంటున్నట్టు పేర్కొంది.