
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఇటీవల కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బిఆర్ఎస్ నుంచి నిజామాబాద్ లోకల్ బాడీ నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాగా, గత కొద్దిరోజులుగా బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్ గా కవిత సంచలన ఆరోపణలు చేస్తున్నారు. మరికొంత మంది బిఆర్ఎస్ నేతలపై కూడా ఆమె తీవ్ర విమర్శలు చేశారు. దీంతో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.