
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్- అప్స్’ నుంచి వస్తోన్న క్రేజీ అప్డేట్స్‌తో సినిమాపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఈ భారీ యాక్షన్ డ్రామాలో రుక్మిణి వసంత్ ను మెలిస్సా పాత్రలో పరిచయం చేస్తూ లుక్ పోస్టర్‌ను మేకర్స్ మంగళవారం రోజున రిలీజ్ చేశారు. పోస్టర్‌ను గమనిస్తుంటే ఆమె అందంగా, అధికారంతో, ఎలాంటి భయం లేకుండా ఉండే పాత్రలో కనిపించనుందనే విషయం తెలుస్తోంది. 1960 చివరలో జరిగే రంగుల ప్రపంచంలో తక్కువ వెలుతురు ఉండే ప్రదేశంలో జరుగుతున్న పార్టీ నేపథ్యంలో ఈ సన్నివేశం ఉంటుంది.
యష్, గీతూ మోహన్ దాస్ కలిసి కథను రాసి.. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాను ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా మరికొన్ని భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్సర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై వెంకట్ కె.నారాయణ, యష్ నిర్మిస్తున్నారు. సినిమా 2026 మార్చి 19న ఈద్, ఉగాది, గుడి పడ్వా పండుగలు కలిసి వచ్చే లాంగ్ వీకెండ్ సమయంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.