Reading Time: < 1 minute

తొమ్మిది నెలల్లో రవాణా శాఖ ఆదాయం రూ.5,142 కోట్లుగా నమోదయ్యింది. 2025-, 26 వార్షిక సంవత్సరానికి ఈ ఆదాయం సమకూరిందని రవాణా శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. జీవిత కాలపు పన్నుల ద్వారా రూ.3,611 కోట్లు త్రైమాసిక పన్నుల ద్వారా రూ.730 కోట్లు, గ్రీన్ టాక్స్ ద్వారా రూ.57 కోట్లు, ఫీజుల ద్వారా రూ.408 కోట్లు తనిఖీల ద్వారా రూ.181 కోట్లు, సర్వీస్ చార్జీల ద్వారా రూ.153 కోట్లు సమకూరిందని రవాణా శాఖ తెలిపింది. 2025, -26 వార్షిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రూ.6,165 కోట్ల ఆదాయమే లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ ముందుకెళ్లగా రూ. 5,142 కోట్ల ఆదాయంతో 83 శాతం వృద్ధిని సాధించిందని రవాణా శాఖ తెలిపింది.