
హైదరాబాద్: నగరంలోని మీర్‌పేట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ హాస్టల్‌లో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ గదిలో ఉరివేసుకొని సరస్వతి(21)అనే యువతి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన యువతిని కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని నర్సాపురం వాసిగా పోలీసులు గుర్తించారు. అనంతరం సరస్వతి తల్లిదండ్రులకు విషయం తెలియజేశారు. అయితే, సరస్వతి ఆత్మహత్యపై ఆమె తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. హాస్టల్, కోచింగ్ సెంటర్ యాజమాన్యం, అశ్వాపురానికి చెందిన నందకిషోర్ అనే వ్యక్తిపై తమకు అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.