
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 198 పోస్టుల భర్తీకి దరఖాస్తు స్వీకరణ గడువు ఈ నెల 20వ తేదీతో ముగుస్తుందని పోలీస్ రీక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 25వ తేదీన రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(టిఎస్‌ఎల్‌పిఆర్‌బి) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధిచిన దరఖాస్తులను డిసెంబర్ 31వ తేదీ నుంచి స్వీరిస్తున్నుట్లు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ గడువు పొడగించేది లేదని, రానున్న రోజుల్లో ప్రభుత్వ సెలవులు ఉన్న నేపథ్యంలో దరఖాస్తుదారులు అవసరమయిన దృవీకరణ పత్రాలు మందస్తుగా సమకూర్చుకోవాలని సూచించారు.
అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తులు త్వరగా సమర్పించాలని, చివరి వరకు వేచి ఉంటే రద్దీతో ఇబ్బంది పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్‌లోట్రాఫిక్ సూపర్వైజర్ ట్రెయినీ(టిఎస్‌టి), మెకానికల్ సూపర్వైజర్ ట్రెయినీ (ఎంఎస్‌టి) పోస్టులను భర్తీలకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రెయినీకి 84 ఖాళీలు, మెకానికల్ సూపర్వైజర్ ట్రెయినీకి 114 ఖాళీలు ఉండగా, పోస్టులకు నెలవారీ వేతనం రూ.27,080 నుంచి రూ.81,400 వరకు ఉంటుందని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. అర్హత కలిగిన, ఆసక్తి గల అభ్యర్థులు www.tgprb.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.