Reading Time: < 1 minute

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతలను దర్శించుకోనున్నారు. ఈనెల 18వ తేదీన మేడారం వెళ్లి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు. మరుసటిరోజు (19వ తేదీన) ఉదయం కుటుంబసభ్యులతో కలిసి ఆయన వనదేవతలను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. అదే రోజు మధ్యాహ్నాం హైదరాబాద్ తిరిగి వస్తారు. అదే రోజు తిరిగి సాయంత్రం దావోస్ పర్యటనకు ఆయన బయలుదేరి వెళ్లనున్నారు. 23వ తేదీ వరకు ఆయన దావోస్‌లో పర్యటించి పెట్టుబడులకు సంబంధించి పలు కంపెనీలతో ఎంఓయూ చేసుకోనున్నారు. 24వ తేదీ ఉదయం అక్కడి నుంచి సిఎం రేవంత్‌రెడ్డి నేరుగా అమెరికా వెళ్లనున్నారు. అమెరికా పర్యటన అనంతరం సిఎం రేవంత్‌రెడ్డి ఫిబ్రవరి 01వ తేదీన ఆయన హైదరాబాద్‌కు రానున్నట్టుగా తెలిసింది.