
రోడ్డు ప్రమాదంలో డెలివరీ బాయ్ మృతిచెందిన సంఘటన మెహిదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… షేక్‌పేట్ హరిజన బస్తీ ప్రాంతానికి చెందిన అభిషేక్(25) జెప్టోలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. రోజు మాదిరిగానే ఇంటి నుంచి బయటికి వెళ్లిన అభిలాష్ బైక్ పై సోమవారం సాయంత్రం ఆర్డర్ డెలివరీ చేసేందుకు టోలిచౌకి ప్రాంతానికి వెళ్తుండగా, బైక్ స్కిట్ అయి రోడ్డుపై పడ్డాడు. దీంతో వెనుక వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అభిషేక్ తలపై నుంచి వెళ్తడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేట్ బస్సు డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.