Reading Time: < 1 minute

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) నిర్వహించిన ఎన్నికల సంఘం సోమవారం ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేసింది. మొత్తం 2.89 కోట్ల మంది ఓటర్లను తొలగించినట్టు వెల్లడించింది. అందులో 46 లక్షల మంది ప్రాణాలతో లేరని పేర్కొంది. 2.17 కోట్ల మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారని 25.47 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటరుగా నమోదు చేసుకుని ఉన్నారని తెలిపింది. సమగ్ర సవరణకు ముందు ఉత్తరప్రదేశ్‌లో 15.44 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

ఈ తొలగింపుతో ప్రస్తుతం ఆ సంఖ్య 12.56 కోట్లకు తగ్గింది. ఇసిఐఎన్‌ఇటి యాప్, ఎన్నికల సంఘం వెబ్‌సెట్ ద్వారా ఈ ముసాయిదా జాబితాలో తమ పేరు ఉందోలేదో తెలుసుకోవచ్చని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఒకవేళ ఎవరి పేరైనా మిస్ అయినా, తమ వివరాల్లో తప్పిదాలు ఉన్నా, ఆన్‌లైన్,ఆఫ్‌లైన్ వేదికగా అభ్యంతరాలు సమర్పించే అవకాశం ఉంది. ఆ అభ్యంతరాలను పరిష్కరించిన తరువాత ఎస్‌ఐఆర్ తుది జాబితా మార్చి 6న విడుదల కానుంది.