
హైదరాబాద్: రాష్ట్రాన్ని డగ్ర్స్ ఫ్రీగా మార్చేందుకు ఈగల్ టీం ఎంతగానో కృషి చేస్తోంది. ఈ మేరకు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి పలు డ్రగ్స్ రాకెట్లను ఇప్పటికే చేధించింది. ఎందరో డ్రగ్ పెడ్లర్లు, వినియోగదారులను అరెస్ట్ చేసింది. అయితే తాజాగా డ్రగ్స్ కేసులతో సంబంధమున్న నైజీరియా మహిళ విక్టరీ ఇతోహన్‌ను ఈగల్ టీం స్వదేశానికి పంపించింది. గత నెలలో ఢిల్లీలో తెలంగాణ ఈగల్ టీం కీలక ఆపరేషన్‌ను నిర్వహించింది. ఆ ఆపరేషన్‌లో ముగ్గురు మహిళలు విశాఖ వెళ్లినట్లు ఈగల్ టీం గుర్తించింది. ఇటీవల రాష్ట్ర సరిహద్దులో ఆ ముగ్గురు మహిళలను ఈగల్ టీం పట్టుకుంది. అందులో విక్టరీ ఇతోహన్ నకిలీ పాస్‌పోర్టుతో ఉన్నట్లు ఈగల్ టీం గుర్తించింది. 2025లో డ్రగ్స్ కేసులో సంబంధమున్న 41 మందిని ఈగల్ టీం స్వదేశానికి పంపించింది.