Reading Time: < 1 minute

హైదరాబాద్‌ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టడంతో డెలివరీ బాయ్‌ మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం సిటీలోని టోలిచౌకిలో చోటుచేసుకుంది. విధి నిర్వహణలో భాగంగా ఆర్డర్‌ డెలివరీ చేసేందుకు వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు బైక్‌ స్కిడ్‌ కావడంతో డెలివరీ బాయ్ కిందపడిపోయాడు. వెనుకనే వేగంగా వచ్చిన ఓ ప్రైవేటు బస్సు అతని పైకి దూసుకెళ్లింది. దీంతో డెలివరీ బాయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.  ఈ ఘటనతో బస్సు డ్రైవర్‌ ఆపకుండా వెళ్లిపోయేందుకు ప్రయత్నంచిగా.. పలువురు  వాహనదారులు, స్థానికులు బస్సును వెంబడించి ఆపి డ్రైవర్ ను పట్టుకున్నారు. అనంతరం సమాచారం అందుకుని సంఘనాస్థలానికి చేరుకున్న పోలీసులకు డ్రైవర్ ను అప్పగించారు. ఈ ప్రమాదంలో మరణించిన డెలివరీ బాయ్ వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.