
జైపూర్: గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఓ క్యాచ్ అందుకొనే ప్రయత్నంలో టీం ఇండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కు తీవ్రగాయమైన విషయం తెలిసిందే. తొలుత ఆస్ట్రేలియాలోనే చికిత్స అందించి ఆ తర్వాత అతడిని భారత్‌కు తీసుకొచ్చారు. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ ఇటీవల బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి క్లియరెన్స్ పొందాడు. ప్రస్తుతం అతను విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఆడుతున్నాయి. అయితే గాయం తర్వాత తొలి మ్యాచ్‌లోనే శ్రేయస్ విజృంభించాడు.
ముంబై రెగ్యులర్ కెప్టెన్ శార్ధూల్ ఠాకూర్‌కి గాయం కావడంతో శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఇవాళ ముంబై, హిమాచల్‌ప్రదేశ్‌తో తలపడుతోంది. పొగ మంచు కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో మ్యాచ్‌ను 33 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై భారీ స్కోర్ సాధించింది. 33 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 299 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 82(53 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులు) పరుగులతో రాణించాడు. ఓపెనర్ ముషీర్ ఖాన్ (73) అదరగొట్టాడు. యశస్వి జైస్వాల్(15), సర్ఫరాజ్ ఖాన్ (21), సూర్యకుమార్ యాదవ్ (24), శివమ్ దూబె (20), సాయిరాజ్ పాటిల్ (25) పరుగులు చేశారు.