Reading Time: < 1 minute

రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు. అయితే కొన్ని రోజులుగా పెద్ది రిలీజ్ గురించి సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ సినిమా అనుకున్న టైమ్‌కి విడుదల కావడం కష్టమేనని.. రిలీజ్ వాయిదా పడుతుందంటూ పోస్ట్‌లు కనిపిస్తున్నాయి. ఈ రూమర్స్‌కి పెద్ది టీమ్ చెక్ పెట్టింది. అనుకున్న ప్రకారమే మార్చి 27న ఈ సినిమా విడుదలవుతుందంటూ స్పష్టం చేసింది. ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎఆర్ రహమాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించి ఓ ప్రత్యేకమైన పోస్టర్‌ని విడుదల చేసిన చిత్ర యూనిట్ అందులో విడుదల తేదీ 27-03-26గా పేర్కొంది. దీంతో సినిమా విడుదల పక్కా అని కన్ఫామ్ అయింది.

ఇక ఈ సినిమా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడస్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన తొలి సింగిల్ ‘చికిరి.. చికిరి’ సంచలనం సృష్టించింది. ఇప్పటికే 125మిలియన్స్‌కి పైగా వ్యూస్‌ని సాధించింది ఇంకా దూసుకుపోతుంది.