
టీం ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే ఎన్నో రికార్డులను సాధించాడు. టెస్ట్ క్రికెట్, టి-20 ఫార్మాట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించిన కోహ్లీ ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే ఈ ఫార్మాట్‌లోనూ అతడు బద్దలుకొట్టడానికి పలు రికార్డులు ఎదురుచూస్తున్నాయి. అందులో ఒకటే ఈ రికార్డు. జనవరి 11వ తేదీ నుంచి న్యూజిలాండ్‌తో టీం ఇండియా వన్డే సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌లో కోహ్లీ మరో 25 పరుగులు సాధిస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో వేగంగా 28వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సాధిస్తాడు. ఇప్పటివరకూ కోహ్లీ 623 ఇన్నింగ్స్‌ో 27,975 పరుగులు చేశాడు. ఇందులో 84 సెంచరీలు, 145 అర్థ శతకాలు ఉన్నాయి. అయితే 28వేల పరుగుల మైలురాయిని సచిన్ టెండూల్కర్ 644 ఇన్నింగ్స్‌లో చేరుకోగా.. శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర 666 ఇన్నింగ్స్‌లో సాధించాడు.
మరోవైపు రోహిత్ శర్మ ముంగిట కూడా ఓ రికార్డు ఎదురుచూస్తుంది. కివీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో హిట్‌మ్యాచ్ మరో 87 పరుగులు చేస్తే.. లిస్ట్-ఎ క్రికెట్‌లో 14వేల పరుగులు పూర్తి చేసిన ఐదో భారత బ్యాటర్‌గా నిలుస్తాడు. సచిన్, గంగూలీ, ద్రవిడ్, కోహ్లీ ఇప్పటికే ఈ మైలురాయిని చేరుకున్నారు. రోహిత్ ఇప్పటివరకూ లిస్ట్-ఎ క్రికెట్‌లో 352 మ్యాచ్‌లు ఆడి 13,913 పరుగులు చేశాడు.