
హైదరాబాద్: రాష్ట్రంలో యూరియాకు కొరత లేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గత ఖరీఫ్ లో కేంద్రం సమయానికి యూరియా సరఫరా చేయలేదని అన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం రబీకి సరిపడా యూరియా సిద్ధంగా ఉందని, రైతులు అడిగినంత యూరియా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. నిజామాబాద్, ఆదిలాబాద్ లో వర్షాలతో సోయాబీన్ రంగుమారిందని, తాము నోడల్ ఏజెన్సీ మాత్రమేనని.. కొనాల్సింది ఎన్ఎఎఫ్ఇడి అని పేర్కొన్నారు. రంగుమారిన సోయాబీన్ ను కేంద్రం కొనడం లేదని, కేంద్రం కొనుగోలు చేసేలా టిబిజెపి నేతలు కూడా ప్రయత్నించాలని తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.