
కన్నడ స్టార్ హీరో యశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘టాక్సిక్’. ‘‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తొలుత ప్రచారం జరిగింది. అన్నట్లుగానే కియారా, హ్యుమా, నయనతారల ఫస్ట్‌లుక్‌లను విడుదల చేసింది చిత్ర యూనిట్. కానీ, అనూహ్యంగా తారా సుతారియా లుక్‌ని కూడా విడుదల చేయడంతో సినిమాలో నలుగురు హీరోయిన్లు అనే విషయం బయటపడింది. కానీ ఈ విషయం అంతటితో ఆగలేదు. ఈ సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు అనే విషయం తాజాగా విడుదలైన మరో బ్యూటీ ఫస్ట్‌లుక్‌తో తెలిసిపోయింది.
రీసెంట్ సెన్సేషన్ రుక్మిణి వసంత్ ఈ సినిమాలో మెలిసా అనే పాత్రలో కనిపిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఇందులో మోడ్రన్ డ్రెస్‌లో పబ్‌లో నడుస్తూ రుక్మిణి కనిపిస్తోంది. మరి ఇంతటితో ఈ సినిమాలో హీరోయిన్ల సంఖ్య ఆగుతుందా..? లేక మరికొందరు హీరోయిన్లు ఈ సినిమాలో ఉన్నారా..? అనే విషయంపై ప్రస్తుతం సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. ఇక మలయాళ దర్శకురాలు గీతూమోహన్ దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కె.జి.ఎఫ్ వంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత యశ్ చేస్తున్న సినిమా ఇది కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మార్చి 19వ తేదీన విడుదల కానుంది.
Introducing Rukmini Vasanth @rukminitweets as MELLISA in – A Toxic Fairy Tale For Grown-Ups#TOXIC #TOXICTheMovie #Nayanthara @humasqureshi @advani_kiara #TaraSutaria #GeetuMohandas @RaviBasrur #RajeevRavi #UjwalKulkarni #TPAbid #MohanBKere #SandeepSadashiva… pic.twitter.com/jv83SVLzYu
— Yash (@TheNameIsYash) January 6, 2026