Reading Time: < 1 minute

అమరావతి: రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలను సస్యశ్యామలం చేయాలనేది మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కల అని వైసిపి మాజీ మంత్రి శైలాజా నాథ్ తెలిపారు. చీకటి ఒప్పందం చేసుకునే ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టును వదిలేశారని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును వైఎస్ఆర్ సిపి నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లాలో శైలజా నాథ్ మీడియాతో మాట్లాడుతూ..2020లో రాయలసీమ ఎత్తిపోతలకు జగన్ శ్రీరం చుట్టారని, రూ. 3,207 కోట్ల వ్యయంతో రాయలసీమ ప్రాజెక్టును చేపట్టారని తెలియజేశారు. వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో 80 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు పూర్తి చేయకుండానే తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తలొగ్గారని శైలాజానాథ్ విమర్శించారు.