
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ సోమవారం సాయంత్రం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. నగరంలో కాలుష్యం పెరిగిపోవడం వల్ల ఆమె చాలా రోజులుగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. దీంతో రొటీన్ చెకప్‌లో భాగంగానే ఆమె ఆస్పత్రిలో చేరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సోనియా ఆరోగ్యం నిలకడగానే ఉందని, చికిత్స కొనసాగుతునే ఉందని పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.