Reading Time: < 1 minute

ముంబై: ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు అందుకోవాలని సినీ ఇండస్ట్రీలోని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. భాషతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు ఒక్కసారైన ఆస్కార్ ట్రోఫీని ముద్దాడాలని కలలు కంటుంటారు. 2023లో తెలుగు పాటైన ‘నాటు నాటు’కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు కేటగిరిలో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఆ అరుదైన ఘనత సాధించేందకు మరో భారత సినిమా అత్యంత చరువలోఉంది. ఆ సినిమానే ‘హెంమ్‌బౌడ్’. జాన్వీ కపూర్, ఇఫాన్ కట్టర, విశాల్ జైత్య ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది.

హైదరాబాదీ ఫిల్మ్‌ మేకర్ నీర్ ఘైవాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్ అదార్‌ పూనావాలా, అపూర్వ మెహతా, సోమెన్‌ మిశ్రా నిర్మించారు.ద ఈ సినిమాను నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరు ఫిదా అయ్యారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఈ సినిమా సత్తా చాటింది. ఇప్పుడు ఆస్కార్-2026లో కూడా దూసుకుపోతుంది. తాజాగా ఈ ప్రకటించిన లిస్ట్‌లో ఈ సినిమా టాప్ 15లో చోటు దక్కించుకుంది. ఆ తర్వాత ఈ 15 చిత్రాల్లో ఉత్తమ ఐదు సినిమాలను ఎంపిక చేస్తారు. ఒకవేళ అందులో ‘హోమ్‌బౌండ్’కు చోటు దక్కితే ఆస్కార్‌‌కి అడుగు దూరంలోకి వెళ్లినట్లే.