Reading Time: < 1 minute

హైదరాబాద్: సింగరేణి కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి ఆసుపత్రుల్లో మార్చి నాటికి వైద్యులు, సిబ్బంది ఖాళీల భర్తీ చేస్తామని అన్నారు. మంగళవారం శాసనసభలో భట్టి కీలక ప్రకటన చేశారు. సింగరేణిపై అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కార్మికుల భద్రతకు భరోసాగా రూ. కోటి ప్రమాద బీమా కల్పిస్తున్నామని, సింగరేణితో పాటు విద్యుత్ ఉద్యోగులకూ వర్తిస్తుందని సూచించారు. 75 రోజుల్లో గోదావరిఖనిలో క్యాత్ లాబ్ ప్రారంభిస్తామని తెలియజేశారు. 32 మంది వైద్యుల కోసం నోటిఫికేషన్ ఇచ్చామని.. త్వరలో భర్తీ చేస్తామని అన్నారు. 176 మంది పారామెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియ జరుగుతోందని, రామగుండంలో క్యాత్ ల్యాబ్ నిర్మాణం పిపిపి మోడల్ లో చేపడుతున్నామని అన్నారు. త్వరలో ప్రభుత్వ ఉద్యోగులందరికి రూ. కోటి బీమా అందిస్తామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.