
మెగాస్టార్ చిరంజీవి హీరోగా హిట్ మెషీన్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక జనవరి 7న హైదరాబాద్‌లో జరగనున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ సందడి చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో మొదటి సారి గా చిరంజీవి, వెంకటేష్ కనిపించబోతోన్నారు. ఈ లెజెండరీ స్టార్స్ చేసే సందడి, వారిద్దరి బంధాన్ని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది.