
నారాయణ పేట: తెలంగాణ నారాయణ పేటలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. భార్యాభర్తలిద్దరికి గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ సారి గొడవతో భార్య ఆవేదనతో పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య కాపురానికి రావడం లేదని కోపంతో ఇద్దరు పిల్లలను తండ్రి శివరాములు ఉరి వేసి చంపాడు. తదుపరి మృతదేహాలను యాపల్ చెరువులో పడేసి.. విద్యుత్ తీగలు పట్టుకుని చనిపోయేందుకు యత్నించి విఫలమయ్యాడు. ఆ తర్వాత పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. శివరాములను స్థానికులు మహబూబ్ నగర్ ప్రభుత్వాస్పతికి తరలించారు.