
పుణె: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి(81)మంగళవారం కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నఆయన పుణెలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కల్మాడి మరణంతో జాతీయ రాజకీయాలు, క్రీడా రంగం ఒక ప్రభావశీల నాయకుడిని కోల్పోయింది. 1944 మే 1న మద్రాస్ లో జన్మించారు. రెండుసార్లు లోక్ సభ, మూడుసార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, ఏషియన్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సేవలందించారు. దివంగత ప్రధానమంత్రి పివి నరసింహారావు కేబినెట్ లో రైల్వేశాఖ మంత్రిగా, భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు.